Video Of Day

Breaking News

భూముల విలువ పెంచిన ప్రభుత్వం


భూముల విలువ పెంచుతూ జిఓ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువ పెరగనుంది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన విలువ అమలులోకి వస్తుంది. భూముల విలువను భారీగా పెంచారు. కొన్ని చోట్ల వంద శాతం కూడా పెంచారు. హైదరాబాద్లో 20 నుంచి 60 శాతం వరకు పెంచారు. అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్ విలువ కూడా భారీగా పెరగనుంది. భూముల విలువ పెంచడం ద్వారా ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. 

ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ ఎక్కవగా ఉంది. ఎల్లుండి నుంచి భూముల విలువ పెరుగుతున్నందున, రేపు సెలవు కావడంతో అత్యధికమంది ఈరోజు భూములను, ఇళ్లను, అపార్ట్మెంట్లను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఎక్కవగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

No comments