తెలంగాణ ఎప్పటిలోగా వస్తుందో చెప్పలేం

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఎపిసోడ్ ముగియలేదని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చెప్పారు. రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తూనే ఉందన్నారు. 

భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతూనే ఉందన్నారు. తెలంగాణ ఇస్తామన్న హామీని నెరవేర్చడానికే అధిష్టానం కట్టుబడి ఉందని చెప్పారు. అయితే తెలంగాణ 

ఎప్పటిలోగా వస్తుందో మాత్రం చెప్పలేనన్నారు. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు అనేవి ప్రతిపక్షాల ఆలోచన మాత్రమేన్నారు. యుపిఏ మాత్రం 2014లోనే ఎన్నికలకు 

వెళ్లాలనుకుంటోందని చెప్పారు. రాహుల్ గాంధీ ఉపప్రధాని పదవి చేపడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment