పాపాల్ని కడిగేసుకునేందుకే టీడీపీ నేతల దీక్షలు: దానం

రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభ పాపం టీడీపీదేనని కార్మిక శాఖామంత్రి దానం నాగేందర్ మండిపడ్డారు. ఆ పాపాల్ని కడిగేసుకునేందుకే టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని ఆయన 

శనివారమిక్కడ అన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన విద్యుత్‌ పోరాటాలను ఒకసారి గుర్తు చేసుకోవాలన్న దానం.... విద్యుత్‌ సమస్యలు పరిష్కరించలేక రైతులు, 

ఆందోళనకారుల్ని పొట్టనబెట్టుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. 

విద్యుత్‌ సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం ఓ వైపు ప్రయత్నిస్తుంటే టీడీపీ నేతలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వకుండా రైతులను గందరగోళ పరచడం మంచిది కాదని 

దానం అన్నారు. మంత్రుల విదేశీ పర్యటనలు తప్పు కాదని మంత్రులు వ్యక్తిగత పనుల మీద సొంత ఖర్చులతోనే రష్యా వెళ్లారని దానం తెలిపారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment