కేజ్రీవాల్ దీక్ష, క్షీణిస్తున్న ఆరోగ్యం

పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా ఏఏపీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న నిరాహార దీక్ష శనివారానికి ఎనిమిదో రోజుకు చేరింది. ప్రజలు ఎవరూ కరెంట్ బిల్లులు చెల్లించవద్దని ఆయన పిలుపునిచ్చారు. విద్యుత్, నీటి సరఫరా విభాగాల్లో పెరిగిన అవినీతి, అక్రమాలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎన్ని విజ్ఞప్తులు చేసిన చెవిటివాడి ముందు శంఖం ఊదిన చందంగా మారినందుకే శాసనోల్లంఘనకు పిలుపు ఇచ్చినట్లు అని కేజ్రీవాల్ ప్రకటించారు. 

కేజ్రీవాల్ పిలుపుకు ప్రజలు భారీగా స్పందించారు. 1, 00,396 మంది పెరిగిన బిల్లులు చెల్లించలేమని ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment