వర్మను తొలగించండి

బేణి ప్రసాద్ వర్మను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని సమాజ్ వాది పార్టీ డిమాండ్ చేసింది. బేణి చేస్తున్న ఆధారరహిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ కు కష్టాలు తప్పవని హెచ్చరించింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ములాయం పార్టీ నాలుగు సీట్ల కంటే గెలవదని బేణి ప్రసాద్ వర్మ వ్యాఖ్యానించారు. వర్మ లాంటి వ్యక్తి కేంద్ర మంత్రి కావడం దురదృష్టకరమని సమాజ్ వాది పార్టీ పేర్కొంది. ఆయనను తక్షణమే మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment