బయటకొచ్చాం.. లాభమేంటి?

చెన్నై: యూపీఏ కూటమి నుంచి తమ పార్టీ బయటకు వచ్చినా లంక తమిళుల పరిస్థితి ఏమీ మారలేదని డీఎంకే అధినేత కరుణానిధి అన్నారు. అయినా యూపీఏకు మద్దతు ఉపసంహరించినందకు తమకేమీ బాధ లేదని చెప్పారు. ‘తమిళనాడు సీఎం జయలలిత సహా కొందరు వ్యక్తులు కోరుకున్నట్టుగా మేం యూపీఏ నుంచి బయటకు వచ్చాం. దాని వల్ల ఏం జరిగింది? లంక తమిళుల సమస్యలకు పరిష్కారం దొరికిందా? శ్రీలంకకు వ్యతిరేకంగా ఐరాస మానవ హక్కుల మండలిలో అమెరికా తెచ్చిన తీర్మానానికి భారత్ సవరణలు తెచ్చిందా? లేదా సవరణలతో కూడిన తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదించిందా? ఒక్క యూపీఏ నుంచి డీఎంకే బయటకు రావడం తప్ప ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా?’ అని పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో కరుణ ప్రశ్నించారు. డీఎంకే 2009లోనే యూపీఏ నుంచి బయటకు వచ్చుంటే లంకలో తమిళల ఊచకోత కాస్తయినా తగ్గి ఉండేవన్న వాదనలపై స్పందిస్తూ.. తమ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. లంక తమిళుల కోసం తానేమీ చేయడం లేదన్న జయలలిత విమర్శలను కరుణ తప్పుబట్టారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment