స్కూల్ పెట్టిన ఏంజెలినా జోలీ

అది అఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్. ఆడపిల్లలకు చదువు అవసరమా? అని అక్కడ ఆలోచిస్తారు. పాఠశాలలకు దూరమైన బాలికల జాబితా అక్కడ చాలానే ఉందట. ఆ పరిస్థితిలో మార్పు తేవాలని ఏంజెలినా జోలీ నిర్ణయించుకున్నారు. దీన్నో యజ్ఞంలా తీసుకున్నారామె. ‘స్టయిల్ ఆఫ్ జోలీ’ పేరుతో ఆమె ప్రత్యేకంగా నగలు తయారు చేయిస్తున్నారు. హాలీవుడ్‌లో హాట్ గాళ్ ఇమేజ్ ఉంది కాబట్టి జోలీ పేరుతో తయారైన నగలు హాట్ కేక్స్‌లా అమ్ముడుపోతున్నాయట.

ఈ కార్యక్రమం తలపెట్టేటప్పుడే దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏదైనా సత్కార్యం కోసం వినియోగించాలనుకున్నారట జోలీ. అది కూడా ఆడపిల్లల చదువు కోసం వినియోగిస్తే బాగుంటుందని ఆమె భావించారు. ‘ద ఎడ్యుకేషన్ పార్టనర్‌షిప్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారామె. స్టయిలాఫ్ జోలీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఈ సంస్థకు కేటాయిస్తున్నారు.

కాబూల్‌లో చదువు విషయంలో బాలికలకు ఎదురవుతున్న నిరాదరణను దృష్టిలో ఉంచుకొని ఈ సంస్థ ద్వారా అక్కడ పాఠశాల ఆరంభించారు. ఇప్పటివరకు 300 మంది బాలికలు చేరారు. వీరి చదువుకి కావల్సిన సకల సౌకర్యాలను ఆ పాఠశాలలో ఏర్పాటు చేశారు జోలి. ఈ విధంగా చేయడం ద్వారా తనకు లభిస్తున్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని జోలీ తెలిపారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment