ఎవరితోనైనా సై

సీనియర్ హీరోతోనైనా, జూనియర్‌తోనైనా నటించడానికి సై అంటోంది అందాల బొద్దుగుమ్మ నమిత. ఇంతకుముందు నమిత అంటేనే యమక్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ ఇప్పటికీ ఉన్నా అవకాశాలు మాత్రం లేవు. కోలీవుడ్‌లో ఎంగల్ అన్నా, ఏయ్ చిత్రాలలో నటించినప్పుడు నమిత అందాలకు కుర్రకారు గుండె లవ్‌లవ్ అని కొట్టుకునేది.

ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ బొద్దుగుమ్మగా మారడంతో ఆమె అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారనే చెప్పాలి. నమిత మాత్రం ఏ మాత్రం దిగులు చెందకుండా రకరకాల దుకాణాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. అలాంటి నమితకు మళ్లీ నటనపై మక్కువ ఏర్పడిందట.

దీంతో ఎక్కువ సమయాన్ని జిమ్‌లోనే గడుపుతూ బరువు తగ్గే ప్రయత్నం చేస్తోందట. ఆహారపు నియమాలను పాటిస్తూ నాజూగ్గా తయారయ్యే ప్రయత్నంలో ఉందట.

నమిత మాట్లాడుతూ తనలో ప్రతిభ ఉంది. దాన్ని ప్రదర్శించడానికి కావలసిన వయసు ఉంది అంటోంది. మళ్లీ హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తా, తడాఖా చూపిస్తానంటున్న నమిత సీనియర్‌తో నైనా, జూనియర్‌తో నైనా నటించడానికి సై అంటోంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment