రాజేంద్రప్రసాద్ రాయల్ రీల్ పురస్కారం


కెనాడాలోని వాంకోవర్‌లో జరుగుతోన్న కెనడా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ రాయల్ రీల్ పురస్కారం అందుకున్నారు. శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో రాజేంద్రప్రసాద్‌కు ఈ పురస్కారాన్ని అందజేశారు.

ఆయన హీరోగా నటించిన ‘డ్రీమ్’ చిత్రం రాయల్ రీల్ విభాగంలో పోటీ పడి విజేతగా నిలిచింది. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటునిగా తాను చాలా గర్విస్తున్నానని రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment