హీరోగా సావిత్రి మనవడు


దివంగత నటి సావిత్రి మనవడు, డాక్టరు చాముండేశ్వరి కుమారుడు అభయ్ హీరోగా రామానుజన్ చిత్రం తెరకెక్కనుంది. అభయ్ ఇందులో గణిత మేధావి రామానుజన్ పాత్ర పోషిం చారు. తమిళం, ఆంగ్లం భాషలలో ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రానికి జ్ఞానరాజశేఖరన్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకుముందు మోహముళ్, ముగం, భారతి, పెరియార్ వంటి సంచలనాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించారు.

గేంబర్ సినిమా పతాకంపై తెరకెక్కనున్న రామానుజన్‌లో మలయాళ నటి భామ నటించనున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో సుహాసిని, నిళల్‌గళ్ రవి, అబ్బాస్, వై.జి.మహేంద్రన్, ఢిల్లీ గణేశన్, వెన్నిరాడై మూర్తి, రాధారవి, తలైవాసల్ విజయ్, మదన్‌బాబు, టి.పి.గజేంద్రన్ తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం రమేష్ వినాయకం, ఛాయాగ్రహణం సన్ని జోసఫ్, పాటలు వాలి అందిస్తున్నారు.

చిత్ర వివరాలను దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్ ఈ నెలలో చెన్నైలో ప్రారంభమవుతుందన్నారు. కుంభకోణం, నామక్కల్, వేలూరు, లండన్, సిడ్నీలోని కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రామానుజన్ పెరిగిన కుంభకోణం సన్నిధిరోడ్డు, టౌన్ హైస్కూల్, నాట్య కళాశాల తదితర ప్రాంతాల్లో ప్రత్యేక అనుమతి తీసుకుని షూటింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment