42 నగరాల్లో 287 పరీక్ష కేంద్రాల్లో ఎడ్‌సెట్‌

రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎడ్‌సెట్‌ను ఈనెల 3న నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 నగరాల్లో 287 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 1,47,865 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను ఎడ్‌సెట్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రారంభమైన తరువాత విద్యార్థులను లోనికి అనుమతించబోమని తెలిపారు. ఉర్దూ మాధ్యమంలో పరీక్ష రాసేవారు హైదరాబాదు, కర్నూలు కేంద్రాల్లో మాత్రమే పరీక్షకు హాజరు కావాలని, హాల్ టికెట్ల కోసం www.apedcet.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment