కి'లేడీ' చైన్ స్నాచర్

సంపన్న కుటుంబానికి చెందిన యువతి జల్సాలకు అలవాటు పడింది. మరో యువకుడితో కలిసి చైన్ స్నాచింగ్ దొంగగా మారింది. మగ స్నాచింగ్ రాయుళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఈ  కి‘లేడీ’ ఇట్టే రాణించింది. హైదరాబాద్లో పలువురి మహిళల చైన్లను తెంచేసిన మొట్టమొదటి లేడీ చైన్ స్నాచర్‌గా పోలీసులకు చిక్కింది. ముంబై ప్రాంతానికి చెందిన ఈ యువతి(22) తన పాత మిత్రుడితో కలిసి హోండా యాక్టివా సాయంతో స్నాచింగ్‌లకు శ్రీకారం చుట్టింది. గతంలో నగరంలో ఉన్న ఈ యువతి తన విద్యాభ్యాసం అనంతరం కొద్ది రోజులు ప్రైవేటు ఉద్యోగం చేసింది. ఆ సమయంలో నగరంలో ఉన్న ఆమెకు పక్కింటి యువకుడితో పరిచయం ఏర్పడింది. సిటీ నుంచి ముంబై వెళ్లిన ఈ యువతి ఇటీవల నగరానికి తిరిగి వచ్చింది. పాత మిత్రుడితో కలిసి సికింద్రాబాద్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. జల్సాలను తీర్చుకునేందుకు ఈ ఇద్దరూ చైన్ స్నాచింగ్‌లను ఆదాయమార్గంగా ఎంచుకున్నట్లు అదుపులో ఉన్న లేడి స్నాచర్ పోలీసులకు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. యువతితోపాటు పట్టుబడ్డ యువకుడు సంపన్న కుటుంబానికి చెందిన విద్యార్థని తెలిసింది. వీరి నుంచి పోలీసులు 60 తులాల బంగారం రికవరీ చేసినట్లు సమాచారం.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment