కాంగ్రెస లోకి టీఆర్ఎస్ నేతలు!


టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన  గుండె విజయరామారావు, ఎ.చంద్రశేఖర్, ఆ పార్టీ నుంచి సస్పెండయిన రఘునందన్ రావు... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ సమక్షంలో వారు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. దిగ్విజయ్ సింగ్‌ వారి భుజాలపై పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ కు రాజీనామ చేసిన రోజునే  చంద్రశేఖర్, విజయరామారావులు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ ముగ్గురితోపాటు మెదక్ ఎంపి విజయశాంతి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. విజయశాంతి ఓ పక్క ఏఐసిసి అధ్యక్షురాలుతోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలను కలుస్తూనే ఉన్నారు. మంగళవారం కూడా ఆమె వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్‌ లను  కలిశారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment