కాంగ్రెస్ పార్టీలోకి విజయశాంతి!!


మెదక్ ఎంపి విజయశాంతి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్‌తోపాటు కాంగ్రెస్ పెద్దలను వరుసగా కలిసిన విజయశాంతి మంగళవారం... కేంద్ర మంత్రి, ఆంటోనీ కమిటీ సభ్యుడైన వీరప్ప మొయిలీని కలిశారు. దాంతో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి మధ్యవర్తిత్వంతో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఆమెను జూలై 31న టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు అంతకు ముందు టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన రఘునందన్ కూడా దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. కాంగ్రెస్ లో చేరి.. వచ్చే సాధారణ ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానాన్నిఆశిస్తున్నట్లు సమాచారం.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment