అద్వానీ అభ్యంతరమెందుకు?

మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై అద్వానీ తన అభ్యంతరాలను పార్టీ నాయకత్వానికి తెలిపారు. ఈ అంశంలో బీజేపీ ముఖ్యమంత్రులను సంప్రదించడంతో పాటు త్వరలోనే రానున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంత వరకైనా వేచి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీని ఈ సమయంలో ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే, కాంగ్రెస్ సర్కారుపై అవినీతి, ధరల పెరుగుదల వంటి అంశాలపై పార్టీ కొనసాగిస్తున్న పోరాటం వెనుకబడి, వివాదాస్పద నేత ఎంపిక అంశం తెరపైకి వస్తుందని అద్వానీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని మోడీ ఎంపికపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌నాథ్ ప్రకటించారు. అద్వానీ గౌరవప్రదమైన నాయకుడని, తాము ఆయన మార్గదర్శకత్వాన్ని కోరనున్నామని తెలిపారు. మోడీ అభ్యర్థిత్వంపై సుష్మా, మురళీమనోహర్ జోషీలకు అభ్యంతరాలు ఉన్నా, చివరి నిమిషంలో వారు మనసు మార్చుకుని పార్లమెంటరీ బోర్డు భేటీకి హాజరయ్యారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment