హైదరాబాద్ ప్రత్యామ్నాయాలివేనా?!


రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ విషయంలో రెండు, మూడు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే వెల్లడించారు. ఆ అంశాలేమిటనేది చెప్పేందుకు నిరాకరించారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న ప్రతిపాదన వాటిలో ఉందా అనే విషయంపై ఈ దశలో తాము ఏమీ చెప్పలేమన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ రూపొందిస్తున కేబినెట్ నోట్ ఎప్పటిలోగా సిద్ధమౌతుందన్న ప్రశ్నకు.. త్వరలోనే కేబినెట్‌కు  సమర్పిస్తామని బదులిచ్చారు. తెలంగాణ బిల్లును ఎప్పుడు పార్లమెంటులో ప్రవేశపెడతారన్న ప్రశ్నకు కూడా ‘వేచి చూడండి’ అని మాత్రమే బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని.. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదని పేర్కొన్నారు.

ఆ ప్రత్యామ్నాయాలివేనా?!
 1. హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకూ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించటం
 2. కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటం
 3. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణను (పోలీసింగ్‌ను) ఢిల్లీ తరహాలో కేంద్ర హోంశాఖ నియంత్రణలోకి తీసుకురావటం
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment