ఆర్‌బీఐకి కొత్తసారొచ్చారు!


రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)కి కొత్తసారొచ్చారు. ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా ఉన్న రఘురామ్ రాజన్ ఆర్‌బీఐ 23వ గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలం పూర్తయిన దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆయన కొలువుదీరారు. రాజన్ బాధ్యతల స్వీకరణ, దువ్వూరి పదవీ విరమణ ఒకే రోజు నేపథ్యంలో ఇరువురూ అభినందనలు తెలుపుకున్నారు. కాగా, బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాజన్ తొలిసారిగా గవ ర్నర్ హోదాలో విలేకరులతో మాట్లాడారు. వస్తూవస్తూనే భారీ చర్యల ప్యాకేజీ తీసుకొచ్చారు. స్వల్పకాలంలో చేపట్టబోయే సవివర రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. రూపాయి అథపాతాళానికి పడిపోయి విలవిల్లాడుతున్న ఫైనాన్షియల్ మార్కెట్‌కు బూస్ట్ ఇచ్చేవిధంగా పలురకాల సెటిల్‌మెంట్‌లను రూపాయిల్లో జరుపుకోవడం తదితర చర్యలను ప్రకటించారు. యాభై ఏళ్లకే ఆర్‌బీఐ చీఫ్‌గా వచ్చి ఈ బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్నవయస్కుల్లో ఒకరిగా రాజన్ నిలిచారు. గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లో ముఖ్య ఆర్థికవేత్తగా  పనిచేశారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment