హైదరాబాద్ యూటీకి ఒప్పుకునేదిలేదు!

హైదరాబాద్‌ను యూటీ చేయాలనే ప్రతిపాదనకు తాము అంగీకరించేది లేదని టీఆర్‌ఎస్ వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించడమంటే సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘లూటీ’ని ఆమోదించడమేనని ఆ పార్టీ తెలిపింది. శతాబ్దాల తెలంగాణ ప్రజల శ్రమతో నిర్మితమైన హైదరాబాద్‌ను కోల్పోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టంచేసింది. యూటీ ప్రతిపాదనను టీఆర్‌ఎస్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నదని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పార్టీ నేతలు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. సంపూర్ణ తెలంగాణ సాధించేంతవరకు టీఆర్‌ఎస్, తెలంగాణ సమాజం విశ్రమించదని తేల్చిచెప్పారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment