కిరణ్, బాబుల వ్యవహారం సిగ్గుచేటు'

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్ర ప్రాంత నాయకుల్లా వ్యవహరించడం సిగ్గుచేటని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్  ఎం.కోదండరాం అన్నారు.  ఎన్డీఏ హయాంలో విభజనను అడ్డుకున్నది తానేనని చంద్రబాబు చెప్పడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చడమేనని చెప్పారు. తెలంగాణ విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన కిరణ్.. ఇప్పుడేమో నిర్ణయాలు పార్టీలు కాదు ప్రజలు తీసుకుంటారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈనెల 7న హైదరాబాద్‌లో నిర్వహించే శాంతి ర్యాలీలో తెలంగాణవాదులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరడం విశేషం. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment