డర్టీ టీమ్ టు డ్రీమ్ టీమ్: నరేంద్ర మోడీకేంద్రంలోని యూపీఏ డర్టీ టీమ్ అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమెడీ అన్నారు. 2014 ఎన్నికల తర్వాత దేశానికి డ్రీమ్ టీమ్ రావాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారం న్యూఢిల్లీలోని జపనీస్ పార్క్ లో బీజేపీ ఏర్పాట్ చేసిన వికాస్ ర్యాలీలో మోడీ ప్రసంగించారు. మన్మోహన్ సింగ్ అసమర్థ ప్రధాని అని ఆయన ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించడంలో యూపీఏ దారుణంగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ అవినీతిని సుప్రీం కోర్టు ఎన్ని సార్లు తప్పుపట్టిన, తన తీరు మార్చుకోలేదన్నారు. అవినీతి అనేది యూపీఏ సర్కార్ కు అలవాటుగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. యూపీఏ పాలనలో భారత్ ను చూసీ ప్రపంచ దేశాలు అపహాస్యం చేస్తున్నాయన్నారు. కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో ప్రభుత్వం పలు అక్రమాలకు పాల్పడి దేశం పరువు గంగలో కలిపారని అన్నారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటనలో భాగంగా వ్యహారించిన తీరును మోడీ తప్పు పట్టారు. మన్మోహన్ యూఎస్ పర్యటనలో పేదరికాన్ని మార్కెట్ చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పేదరికాన్ని సినిమాల్లో చూపించి అవార్డులు అందుకునేవారిలా ప్రధాని వ్యవహారించారని మోడీ వ్యాఖ్యానించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment