సోషల్ మీడియాలో పార్టీల ప్రచారం!


రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను తమ ప్రచారానికి విరివిగా వాడుకుంటాన్నాయి. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండడాన్ని గమనించిన పార్టీలు ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల మాటలను, విమర్శలను తిప్పికొట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. అందులో భాగంగా పార్టీ నేతలకు ఏకంగా శిక్షణ, అవగాహనా సదస్సులను కూడా పార్టీలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ముందంజలో నిలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్లొండ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలకు సోషల్ మీడియాపై అవగాహన శిక్షణ తరగతులను బుధవారం గాంధీభవన్ లో ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆయన పార్టీ వర్గాలను తెలిపారు. సోషల్ మీడియా అవశ్యకతను ఆయన ఈ సందర్బంగా వివరించారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment