విభజనపై వెనక్కితగ్గే వరకు ఉద్యోగుల సమ్మె


రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలంటూ శనివారం హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో ఏపీఎన్‌జీవోలు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ అవగాహన సదస్సు’ను నిర్వహించారు. సీమాంధ్రలోని పదమూడు జిల్లాలతో పాటు.. హైదరాబాద్ నగరం నుంచి కూడా సమైక్యవాదులు సభకు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రం విడిపోతే విద్యార్థులు, ఆర్‌టీసీ కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని.. అన్ని రంగాల్లోనూ దెబ్బతింటామని ఆందోళన వ్యక్తంచేశారు. విభజనపై వెనక్కితగ్గే వరకు ఉద్యోగుల సమ్మె కొనసాగుతుందని స్పష్టంచేశారు. విభజన ప్రక్రియపై ముందుకెళితే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విద్యుత్, మునిసిపాలిటీ, రెవెన్యూ సిబ్బంది, ఆర్‌టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. పోలీసులు గుర్తింపుకార్డులను పరిశీలించిన తర్వాతే ఉద్యోగులను స్టేడియం లోపలికి అనుమతించారు. ఉద్యోగులతో ఎల్‌బీ స్టేడియం పూర్తిగా నిండిపోగా ఇంకా ఎంతో మంది స్టేడియం వెలుపలే నిలిచిపోయారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమైంది. సభకు అంతరాయం కలిగించటానికి ఒక వ్యక్తి వేదికపైకి చెప్పు విసరటం, ఒక పోలీస్ కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలు చేయటం మినహా.. స్టేడియంలో సభ ప్రశాంతంగా సాగింది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment