Video Of Day

Breaking News

కిరణ్.. దిష్టిబొమ్మ












రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మలా చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు ప్రజలకు నమ్మకంగా ఉంటారా... సోనియాగాంధీకి విధేయులుగా ఉంటారా అని షర్మిల ఈ సందర్భంగా ప్రశ్నించారు. సమైక్య శంఖారావం బస్సుయాత్రలో భాగంగా షర్మిల బుధవారం గుంటూరు జిల్లా వినుకొండలో మాట్లాడారు. కేంద్రం తెలుగు రాష్ట్రాన్ని విడుదీస్తుందంటే అందుకు కారణం చంద్రబాబునాయుడి మద్దతేనని అన్నారు. బాబు అసలు తెలంగాణపై లేఖను ఎందుకు ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు. యాత్రలు చేస్తున్న బాబుకు ఆత్మగౌరవం ఉందా అని అన్నారు. వైఎస్ఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించారని షర్మిల గుర్తు చేశారు. ఏ ఛార్జీలు వేయకుండానే వైఎస్ఆర్ అన్ని అభివృద్ధి పనులు చేశారన్నారు.  వైఎస్ సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచిందని షర్మిల విమర్శించారు.

No comments