అమెరికాకు సోనియా


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం మధ్యాహ్నం అమెరికాకు బయలుదేరారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక ఎనిమిది రోజుల తర్వాత భారత్ కు తిరిగి వస్తారు. సోనియా గాంధీ వెంట కూతురు ప్రియాంక వాద్రా కూడా వెళ్లారు. ఆరు నెలలకు ఒకసారి జరిగే వైద్య పరీక్షల కోసం సోనియా అమెరికా వెళ్లాలి. అయితే గత సంవత్సరం సెప్టెంబర్ లోనే వెళ్లాల్సి ఉండగా కొన్ని కీలక సమావేశాల కారణంగా వాయిదా పడింది. ఈ మధ్య ఆహర భద్రత బిల్లు చర్చ జరుగుతున్న సందర్భంలో లోసభలో సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment