తెలంగాణపై 20 రోజుల్లో కేబినెట్‌కు నోట్ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను మరో 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పించబోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం తెలిపారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గ తీర్మానం కోసం హోం శాఖ సమర్పించాల్సిన నివేదికను సిద్ధం చేస్తున్నారు. మంత్రివర్గ ఆమోదం కోసం తయారు చేసే నోట్ను తొలుత  కేంద్ర న్యాయ శాఖ ఆమోదానికి పంపిస్తారు. న్యాయ శాఖ ఆమోదించాక 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పిస్తారు. నోట్ రూపకల్పనలో ఎలాంటి జాప్యమూ జరగడం లేదని సమాచారం.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment