Video Of Day

Breaking News

విజయవాడలో తెలంగాణ సభ!

తెలంగాణకు అనుకూలంగా విజయవాడలో సభ పెడితే అనుమతిని ఇస్తారా? అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న రాజకీయపార్టీలు, సామాజిక జేఏసీ వంటి సంఘాలు, ప్రత్యేక ఆంధ్రా సంఘాలు సభలు పెట్టుకుంటామంటే సీమాంధ్రలో ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. తెలంగాణలో భావ ప్రకటనా స్వేచ్ఛకు అనుమతించినప్పుడు అదే సూత్రం సీమాంధ్రలో ఎందుకు అమలుచేయరని అడిగారు. విజయవాడలో తెలంగాణ సభను పెడతామని, అనుమతి ఇవ్వాలని  శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, అద్దంకి దయాకర్డి మాండ్ చేశారు. హైదరాబాద్‌లో సభపెట్టి తెలంగాణవాదులపైనే దాడికి దిగడం అప్రజాస్వామికమన్నారు. పోలీసులు, ప్రభుత్వం కూడా తెలంగాణకు ఒక చట్టం, సీమాంధ్రకు మరో చట్టాన్ని అమలు చేస్తున్నాయని విమర్శించారు

No comments