అరబిక్ భాష నేర్చుకుంటున్న కత్రినాకైఫ్


అరబిక్ భాష నేర్చుకునే పనిలో పడింది బాలీవుడ్ బ్యూటీ  కత్రినాకైఫ్. ‘ఫాంథమ్’ సినిమా కోసమే ఆమె ఈ భాషను అధ్యయనం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఫొటో జర్నలిస్ట్‌గా కత్రినా నటిస్తుంది. అడపా దడపా ఈ పాత్ర అరబిక్ మాట్లాడుతుంది. అందుకని, ఇంట్లోనే కాకుండా షూటింగ్‌లో గ్యాప్ దొరికినప్పుడల్లా ఈ భాష నేర్చుకుంటున్నారామె.
‘జిందగీ నా మిలేగా దొబారా’ సినిమా కోసం బైక్ నడపడం నేర్చుకున్న్రవిషయం తెలిసిందే. మగాళ్లు నడిపే హెవీ బైక్‌ని సునాయాసంగా నడిపి, భేష్ అనిపించుకుంది. ఆ తర్వాత, ‘మేరీ బ్రదర్ కీ దుల్హన్’ సినిమా కోసం గిటార్ నేర్చుకుంది. అలాగే, ‘ధూమ్ 3’ కోసం సర్కస్ ఫీట్స్ కూడా తెలుసుకుంది. అదే సినిమా కోసం ఫైట్స్‌లో కూడా శిక్షణ తీసుకుంది. ఇలా పాత్ర ఏది డిమాండ్ చేస్తే అది నేర్చుకోవడానికి, శాయశక్తులా కష్టపడటానికి వెనకాడలేదామె. ఇక, భవిష్యత్తులో సినిమా కోసం కత్రినా ఏమేం నేర్చుకుంటారో చూడాలి.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment