Video Of Day

Breaking News

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన!

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సుచేస్తూ కేంద్రమంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా నేపథ్యంలో...  రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించిన కేంద్రం ఎట్టకేలకు రాష్ట్రపతి పాలనకే మొగ్గుచూపింది. ఈ మధ్యకాలంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలపై కూడా ఆరాతీసి, అది సాధ్యంకాదనే నిర్ణయానికి వచ్చింది. దీంతో రాష్ట్రంలో చాలా ఏళ్ల తర్వాత రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తోంది. రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్కసారి రాష్ట్రపతి పాలన విధించారు. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో 1973 జనవరి 11 నుంచి డిసెంబరు 10 వరకు రాష్ట్రపతి పాలన ఉంది. ప్రస్తుతం ఇది రెండోసారి. రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే గవర్నర్‌ పాలన అమల్లోకి వస్తుంది. 

No comments