సమస్తాధికారాలు గవర్నర్‌కే

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే గవర్నర్‌కు సమస్తాధికారాలు సమకూరుతాయి. ముఖ్యమంత్రి, మంత్రిమండలి బాధ్యతలన్నీ ఆయనకు సంక్రమిస్తాయి. విశ్రాంత ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌లను ఆయనకు సలహాదారులుగా కేంద్రం నియమిస్తుంది. వీరికి మంత్రుల బాధ్యతలు వస్తాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక బాధ్యతలు నిర్వహిస్తాడు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫైళ్లను ఇద్దరు సలహాదారులు పరిశీలిస్తారు. శాంతిభద్రతలు తదితర శాఖల ఫైళ్లను సీఎస్‌ పరిశీలిస్తారు. వీరి నుంచి వచ్చిన ఫైళ్లపై గవర్నర్ తుది నిర్ణయం తీసుకుంటారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment