పదవికి, పార్టీకి కిరణ్ రాజీనామా!

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ లాస్ట్ బాల్ వేశారు. ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామాతో కేంద్రానికి తన నిరసనను బలంగా చాటారు. క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగస్వామికి కావడం ఇష్టం లేనందున రాజీనామా చేసినట్లు కిరణ్ తెలిపారు. విభజన బిల్లు తప్పుల తడకగా ఉందని, అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో పెట్టటమే రాజ్యాంగ విరుద్ధం అని ఆవేదన వ్యక్తం చేశారు. దానిపై న్యాయపోరాటం చేయాల్సిన అవసరముందని చెప్పారు.

గవర్నర్ కు సమర్పణ, ఆమోదం!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. ఇదిలా ఉండగా గవర్నర్ కొద్దినిమిషాల్లోనే రాజీనామా ఆమోదించినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి 3 సంవత్సరాల 2నెలల 27 రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి.... అత్యధిక కాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఎనిమిదో స్థానంలో నిలిచారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment