విభజనను ఆపలేకపోయిన సీఎం

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆపుతానని, ఇంకా చివరి బంతి ఉందంటూ ఇప్పటివరకు చెప్పుకొచ్చిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లు ప్రక్రియ ముందుకు వెళ్లకుండా అడ్డుకోలేక పోయారు. సీఎం చివరి బంతితో విభజన ఆగుతుందనే నమ్మకంతో ఇప్పటివరకు ఆయన వెంట నడిచిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. విభజన బిల్లును లోక్‌సభ ఆమోదించడం, చివరకు కిరణ్ చేతులెత్తేయడంతో ఒక్కసారిగా దిగాలుపడ్డారు. అటు కాంగ్రెస్‌లో ఉండే పరిస్థితి లేక, ఎటు వెళ్లాలో, తమ రాజకీయ భవితవ్యమేమిటో అర్థంకాక ఆందోళనలో పడ్డారు. సీఎం పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా కిరణ్  రాజీనామా చేయడంతో ఏం చేయూలో పాలుపోని అయోమయంలో ఉన్నారు. మొత్తానికి విభజనను అడ్డుకోలేకపోయారన్న సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment