Video Of Day

Breaking News

కిరణ్ గుడ్ బాయ్!

కాంగ్రెస్ పార్టీని, అధిష్టానాన్ని ధిక్కరించి పార్టీకి, పదవికీ రాజీనామా చేసిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశంసించారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఏకగ్రీవం ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ఎంపికైన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విభజన అంశంలో హుందాగా వ్యవహరించనప్పటికీ పార్టీ విధేయుడిగా ఉండి, పార్టీకి ఇబ్బంది లేకుండా  వ్యవహరించారని ఆయన కితాబునిచ్చారు. అంతేకాకుండా కిరణ్ తిరిగి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామని కూడా తెలిపారు. రాజకీయ పునరావాసం కోసమే కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారని రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. 

No comments