ఫైళ్ల 'విభజన'!

రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని శాఖలవారీగా అతి ముఖ్యమైన ఫైళ్లను తెలంగాణ, సీమాంధ్రవారీగా విభజించాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయితేనే రెండు రాష్ట్రాల రోజువారీ పాలనావసరాలను ప్రాథమికంగానైనా తీర్చడం వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.
 విభజన ప్రక్రియలో ప్రధానంగా ఫైళ్ల విభజనకు ఎక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతం ఫైళ్లన్నీ ఆయా విభాగాల్లో సెక్షన్లవారీగా ఒకే చోట ఉన్నాయి. వాటన్నిటినీ విభజించి ఆయా రాష్ట్రాలకు అప్పగించాల్సి ఉంది. విభాగాలవారీగా ఫైళ్లను వేరు చేసి ఆయా రాష్ట్రాలకు అందివ్వడం, రసీదులు తీసుకోవడం తదితర ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటున్నందున నగరంలో సీమాంధ్ర ప్రభుత్వానికి అవసరమైన భవనాలు, పరికరాలు, వాహనాలను సమకూర్చాలి.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment