ప్రభుత్వ ఏర్పాటా? రాష్ట్రపతి పాలనా?

రాష్ట్ర విభజన, ముఖ్యమంత్రి రాజీనామా నేపథ్యంలో... రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిని నియమించాలా? లేక రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది.  కీలక సమయంలో రాష్ట్రంలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల బేరీజు వేస్తూ  కాంగ్రెస్ పెద్దలు... పార్టీకి చెందిన తెలంగాణ, సీమాంధ్ర నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తూ కాలక్షేపం చేస్తోంది. రాష్ట్రం విడిపోతున్న తరుణంలో సీమాంధ్రకు చెందిన నేతలు చిరంజీవి, కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణల్లో ఒకరిని సీఎం చేయాలన్న ప్రతిపాదనను హైకమాండ్ పరిశీలిస్తున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment