Video Of Day

Breaking News

అధికారులు, పెన్షనర్ల విభజన!

రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర క్యాడర్‌కు ఎంపికై విధులు నిర్వహిస్తున్న ఇతర రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ తదితర సివిల్ సర్వీస్ అధికారులను ఏ రాష్ట్రంలో ఉంచాలనే దానిపై ప్రక్రియ కొనసాగనుంది. వారు ఏ రాష్ట్రంలో పని చేయాలనుకుంటున్నదీ తెలుపుతూ వారి నుంచి ఆప్షన్ ఫారాలు తీసుకోవడం, అభ్యంతరాలుంటే పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, రాష్ట్ర అధికారులకు సంబంధించి ఆయా విభాగాధిపతులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల గణాంకాలు సేకరించి, వారికీ విభజన ఆప్షన్స్ ఇవ్వాలి. ఇబ్బందుల్లేకుండా వారిని ఇరు ప్రాంతాలకూ పంపిణీ చేయాలి. పెన్షనర్లను కూడా కేంద్రం రూపొందించే విధివిధానాలకు అనుగుణంగా పంపిణీ చేయాలి.

No comments