తక్కువ వ్యవధి సరిపోతుందా?

రాష్ట్ర విభజన నేపథ్యంలో ... తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే దానిలో అపాయింటెడ్ డేను ప్రస్తావించాలి. అయితే ఈ లోగా అంటే ఎన్నికల షెడ్యూలు మార్చి తొలి వారాంతంలో రావాల్సి ఉంది. ఇంతలోనే అపాయింటెడ్ డేను ప్రకటించి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తే.. న్యాయపరమైన చిక్కులు ఉండవని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చినట్టు చెప్పుకొని లబ్ధిపొందవచ్చని, సీమాంధ్ర ప్రాంతంలో తాము ఆ ప్రాంతానికి బిల్లులోనూ, ప్రధానమంత్రి ప్రసంగంలోనూ చేసిన మేలును చెప్పుకోవచ్చని యోచిస్తోంది. అయితే.. విభజనకు సంబంధించి లాంఛనాలు పూర్తిచేసేందుకు ఇంత తక్కువ వ్యవధి సరిపోదన్నది ఇందులో ప్రతికూలాంశం.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment