కారత్‌తో జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించాలని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ను కోరారు. కారత్‌తో భేటీ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా, పలు విషయాలను జగన్ చర్చించారు. పార్లమెంటులో టీ-బిల్లును ప్రవేశపెట్టామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తాము ఒప్పుకోబోమని కారత్ పేర్కొన్నారు. టీ-బిల్లుపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై మాట్లాడేందుకు ప్రతి ఎంపీకి హక్కు ఉంటుందని చెప్పారు. టీ- బిల్లును అడ్డుకోవడంలో తమ వంతు సహకారం చేస్తామని కారత్‌ హామీ ఇచ్చారని జగన్ తెలిపారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment