కిరణ్... 3 సంవత్సరాల 2 నెలల 27 రోజులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కిరణ్‌కుమార్‌రెడ్డి సెప్టెంబరు 10 , 2010న పదవీబాధ్యతలు స్వీకరించారు.  ఫిబ్రవరి 19 , 2014న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదంతో రాష్ట్ర విభజనకు నిరసనగా ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రస్థానం...

కిరణ్‌కుమార్‌రెడ్డి తన తండ్రి అమరనాథరెడ్డి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం( వాయల్పాడు) నియోజకవర్గం నుంచి 1989, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 1994 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో వాల్మీకిపురం నియోజకవర్గం రద్దవడంతో పీలేరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 12వ శాసనసభలో ఆయన చీఫ్‌ విప్‌గా వ్యవహరించారు. 13వ శాసనసభలో కొంతకాలం స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన పరిణామాల దృష్ట్యా అప్పటి సీఎం రోశయ్య రాజీనామాతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని మెరుగు పరిచేందుకు అనేక పథకాలను ప్రారంభించారు. ఎస్సీ,ఎస్టీసబ్‌ప్లాన్‌, మీ సేవ, రాజీవ్‌ యువకిరణాలు, ఇందిరమ్మ అమృతహస్తం , ఇందిర జలప్రభ... తదితర పథకాలు ప్రధానమైనవి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన 3 సంవత్సరాల 2 నెలల 27 రోజుల పాటు బాధ్యతలు నిర్వహించారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment