నమ్మినోళ్లు నట్టేట!

కిరణ్ కుమార్ రెడ్డి తనను నమ్మి వచ్చిన నేతలకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే రాజీనామా చేయడం, భవిష్యత్ కార్యచరణ ప్రకటించకపోవడంపై కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర అసంతృప్తిని రగులుస్తోంది. బ్రహ్మాస్త్రముందన్నారని ఇప్పటివరకు సీఎంను నమ్ముకొని ఉంటే చివరకు ఎటూకాకుండా పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను నమ్ముకొని సీనియర్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా ఇబ్బందుల పాలయ్యారని ఒక మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, ఎంపీలు రాయపాటి, ఉండవల్లి, హర్షకుమార్, లగడపాటి, సాయిప్రతాప్ తదితరులంతా సీఎంపై ఎంతో నమ్మకంతో ఉన్నారని, చివరికిలా అవుతుందని వారూ ఊహించలేదని చెప్పారు. కిరణ్‌ను నమ్ముకొని లగడపాటి పార్లమెంటులో పెప్పర్‌స్ప్రే వినియోగించడంతో జాతీయస్థాయిలో విమర్శలపాలయ్యారని, చివరకు రాజకీయ సన్యాసం తీసుకోవలసి వచ్చిందని మరో మంత్రి వాపోయారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కావూరి, రాయపాటి, ఉండవల్లి, హర్షకుమార్ వంటివారు ఇప్పటివరకు కాంగ్రెస్‌నే నమ్ముకొని ఉన్నారని ఇప్పుడు వారి పరిస్థితీ దయనీయంగా మారిందని చెప్పారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment