కిరణ్ కొత్త పార్టీ పెట్టేనా?

కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా నేపథ్యంలో... ఆయన కొత్త పార్టీ పెడతారా? లేదా? ఏం చేయనున్నారని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాజీనామా తర్వాత భవిష్యత్ కార్యాచరణ పై కిరణ్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో  ఆచితూచి అడుగు వేయాలని కిరణ్ నిర్ణయించినట్లున్నారు. కొత్త పార్టీపెట్టాలా? వద్దా? పార్టీ పెడితే ఎంతమంది నేతలు వెంట నడిచే అవకాశం ఉంది? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రజల ముందుకు ఎలా వెళ్లాలి? ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల విశ్వాసం పొందేదెలా? అనే అంశాలపై తీవ్రంగా తర్జనభర్జనలు పడుతున్నారు.
భవిష్యత్ కార్యచరణపై పలువురు నేతలతో కిరణ్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ వారికి ఎలాంటి స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వకుండా మరింత అయోమయానికి గురిచేస్తున్నారు. కొత్త పార్టీ పెడతానని కానీ, పెట్టనని కానీ ఆయన వారికి చెప్పలేకపోతున్నారు.  ఈ నెల 21తో పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నందున 22నాటికి ఎంపీలు కూడా రాష్ట్రానికి వస్తారు. ఆ తరువాత సమావేశమవుదాం అని చెబుతూ సరిపెడుతున్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment