సన్యాసమా! సర్దుబాటా!

విజయవాడ లోక్ సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్... రాజకీయ సన్యాసం స్వీకరించి నాలుగు రోజులైనా గడవక ముందే మళ్లీ రాజకీయాలలోకి రానున్నారా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనుమానాలకు తావిస్తున్నాయి. సన్యాసం పక్కన పెట్టి సర్దుకుపోయే ధోరణినే ఎంచుకునేందుకు ఆయన సిద్ధపడుతున్నారనే ఊహలకు ఆజ్యం పోస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు లోక్ సభలో, రాజ్యసభలో ఆమోదం లభించగానే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే! అంతేకాదు వెంటనే లోక్ సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వాటినీ లోక్సభ స్పీకర్, పార్టీ ఆమోదించాయి కూడా!  అంతవరకు బాగానే ఉంది. మళ్లీ ఆ తరువాత జరిగే సంఘటనలే ఆయన మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నట్లు తెలియజేస్తున్నాయి.

లగడపాటి ఓ త్యాగమూర్తి అంటూ కీర్తిస్తూ కృష్ణా జిల్లాలో భారీ  ప్లెక్సీలు, పోస్లర్లు వెలిశాయి. ఆ ప్లెకీలు, పోస్లర్లపైన లగడపాటిని ఉద్దేశించి “పోరాటమే ఊపిరిగా పోరుబాట పట్టావు. నీ సత్తా చూపావు. రాజకీయ త్యాగివై నిలిచావు. ఆరు కోట్ల ఆంధ్రులకు ఆరాధ్యనీయుడైనావు...” అంటూ విజయవాడ ప్రధాన కూడళ్లలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీల వ్యవహారం అంతా లగడపాటి మళ్లీ రాజకీయ పునరాగమనం కోసమేననే అనుమానాలకు తావిస్తున్నాయి.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment