కొత్త పథకాలు, ఉద్యోగాలుండవ్!

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే.... ఇప్పటికే ఉన్న పథకాలనే కొనసాగించాల్సి ఉంటుంది. తుఫానులు, విపత్తుల వంటి అసాధారణ సమయాల్లో తప్పితే ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. పోస్టుల భర్తీ, నామినేటెడ్‌ నియామకాలూ జరగవు. జీత భత్యాల పెరగవు. కొత్త పీఆర్‌సీకి అవకాశం ఉండదు.  రాష్ట్రపతి పాలన సమయంలో ఎన్నికల నియామావళి అమల్లోకి వస్తే ఎన్నికల కమిషన్‌ పరిధిలో గవర్నర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్లు, ఎస్పీలు ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి.

రాష్ట్రపతి పాలన, శాసనసభ సుప్తచేతనావస్థ వల్ల ముఖ్యమంత్రి, మంత్రులు ఇక మాజీలవుతారు. శాసనసభ్యులు మాత్రమే ఉంటారు. వీరికి ఎలాంటి అధికారిక హోదాలు ఉండవు. నెలవారీగా జీతం మాత్రం అందుతుంది. శాసనసభే సస్పెన్షన్‌లో ఉంటోంది కనుక సభాపరమైన కమిటీల్లో ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుంది. ప్రభుత్వమే లేదు కాబట్టి.. జిల్లాల్లో ఎమ్మెల్యే హోదాలో వివిధ కమిటీల్లో ఉండే సభ్యత్వాలూ రద్దవుతాయి. ప్రొటోకాల్‌ అసలే ఉండదు. నియోజకవర్గ అభివృద్ధి కోటాలో నిధుల మంజూరు వంటి వ్యవహారాలూ ఉండవు. శాసనసభ స్పీకర్‌ మాత్రమే సాంకేతికంగా పదవిలో ఉంటారు. కొత్త శాసనసభ ఏర్పాటై ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు చేపట్టేవరకూ స్పీకర్‌ పదవిలో కొనసాగుతారు. శాసనమండలికి మాత్రం సుప్తచేతానవస్థ వర్తించదు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment