తెలంగాణలో ఓదార్పు ఎందుకో!

ఏళ్లనాటి కళ సాకారమైందన్న ఆనందంలో తెలంగాణ ప్రజలు సంబురాలు చేసుకుంటుంటే...  వైఎస్ఆర్ సీపీ మాత్రం తమ అధినేత తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపడతారని ప్రకటించడం విడ్డూరంగా ఉంది. తెలంగాణ పది జిల్లాల శాసనసభా నియోజకవర్గ సమన్వయకర్తల, ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించాలని జగన్ ఓదార్పు యాత్రను తలపెట్టిన విషయం తెలిసిందే. సీమాంధ్ర ప్రాంతంలో ఓదార్పు నిర్విఘ్నంగా సాగినా... తెలంగాణలో ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఇప్పటికి ఓదార్పు యాత్ర పూర్తయింది. మిగతా జిల్లాల్లో కూడా ఓదార్పు యాత్ర చేస్తారని ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఓదార్పు చేయొద్దంటున్న తెలంగాణ నాయకులకు దీటుగానే సమాధానమిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఇళ్లకు ఎపుడైనా వెళ్లి ఓదార్చారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment