రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనే!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు
జరుగనున్నాయి. ఈ సందర్భంలో రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిని నియమించే సాహసం కాంగ్రెస్‌ చేయకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం రాష్ట్రపతి పాలనే. అయితే గవర్నర్‌ సిఫార్సు ఆధారంగా నిర్ణయం వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో 1973 జనవరి 11న పీపీ నరసింహరావు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటి నుంచి రాష్ట్రపతి పాలన డిసెంబర్‌ 10, 1973 వరకు కొనసాగింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యమైతే రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను మార్చే అవకాశం ఉంది
. అదే జరిగితే రాష్ట్ర గవర్నర్‌గా హన్స్‌రాజ్‌ భరద్వాజ్‌ లేదా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను నియమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment