రాజ్యసభలోనూ ఆమోదం.. వాట్ నెక్స్ట్?

లోక్‌సభ, రాజ్యసభల ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు-2014ను ఇక ఉభయ సభల సెక్రటరీ జనరళ్లు హోంశాఖకు పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చిన బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి తిరిగి హోంశాఖకు రాగానే గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. గెజిట్ నోటిఫికేషన్‌కు.. రాష్ట్ర అవతరణకు గతంలో కనిష్టంగా 6 రోజుల సమయం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోంశాఖ త్వరగా రాష్ట్రపతికి పంపే ప్రక్రియను చేపట్టనుంది. ఎన్నికల షెడ్యూలు ముంచుకొస్తుండటం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజీనామాచేయటం వంటి పరిణామాల నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా రెండు రాష్ట్రాలను ఏర్పాటుచేసి.. రెండిటికీ ముఖ్యమంత్రులను ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కొత్త రాజకీయ పరిణమాలు అవసరం లేదని భావిస్తే.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రపతి ఆమోద ముద్ర లభిస్తే.. గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి నెలాఖరులోనే రెండు రాష్ట్రాలను ఏర్పాటుచేయాలని కేంద్రం భావిస్తోంది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment