పొత్తా? విలీనమా?

రాష్ట్ర విభజన పూర్తి స్థాయిలో ఖరారైన నేపథ్యంలో... తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కానుందా? లేదా సొంతంగా వ్యవహరిస్తూ కేంద్రంలో కాంగ్రెస్కు మద్దతు ప్రకటిస్తుందా? అనే అంశం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీలో విలీనం వద్దని దాదాపు 90 శాతం మంది తమ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో ఆ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా తమకు అంతే ముఖ్యమని వారి భావన. తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని తామంతా కోరుకుంటున్నామని చెబుతున్నారు. దీన్ని బట్టి విలీనం లేనట్లేనని అర్థమవుతోంది. అదే సమయంలో తెలంగాణ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి సంబంధించిన కీలక బాధ్యతలు కేసీఆర్ కు అప్పగిస్తే తమ పార్టీ విలీనంపై ఆలోచిస్తామని కూడా కొందరు నాయకులు పేర్కొంటున్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment