'చిన్నమ్మ'నూ గుర్తుంచుకోండి!

లోక్ సభలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది ఒక్క సోనియా గాంధీ అనుకోవద్దని, ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోవాలని కోరారు. అంటే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి కొన్ని ఓట్లు ముట్టజెప్పాలన్నమాట. విభజన ముసుగులో దాగిఉన్న ఓట్ల, సీట్ల మంత్రాంగం ఇక్కడ బహిరంగంగానే బయటపడింది.  తెలంగాణలో ఆత్మహత్యలను ఆపేందుకు, తెలంగాణ ప్రజల కలసాకారమయ్యేందుకు ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇస్తామని వాగ్దానం చేశామని, మాట నిలబెట్టుకునేందుకే ఇప్పుడు తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చామని 'చిన్నమ్మ' తెలిపినప్పటికీ దాని వెనుక దాగిన వారి నిజస్వరూపం తెలిసిపోతుంది. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మాస్వరాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే బాగుండేది. ఏదేమైనా ఈ మాటలతో... తెలంగాణ ప్రజల్లో క్రెడిట్ కంటే ఎక్కువగా.. సీమాంధ్రుల ఆగ్రహానికి గురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment