హోంశాఖకు టీ-బిల్లు

పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన తరువాత న్యాయశాఖ పరిశీలనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2014 బుధవారం తిరిగి హోంశాఖకు చేరింది. దీనిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపించాల్సి ఉంది. బుధవారం రాత్రి కానీ, గురువారం కానీ రాష్ట్రపతికి చేరే అవకాశం ఉంది. కాగా పార్లమెంటు 15వ సెషన్ ముగిసినట్టుగా భావిస్తూ ప్రొరోగ్ చేయాలని కోరుతూ హోంశాఖ రాష్ట్రపతికి నివేదన పంపింది. సాధారణంగా పార్లమెంటు సెషన్ ఇలా అధికారికంగా ముగిస్తే ఇక కేంద్రం ఆర్డినెన్సులు తేవడానికి వీలుంటుంది. అలాగే రాష్ట్రపతి పాలన విధించేందుకు కూడా అవకాశం ఉంటుంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment