ఇక టీ-బీజేపీ వంతు!

తెలంగాణ రాష్ట్రసాధన కోసం ఇప్పటివరకు టీ-కాంగ్రెస్, టీఆర్ఎస్లు మాత్రమే ఢిల్లీకి పయనమవుతుండడం చూశాం. ఇప్పుడు తెలంగాణ ప్రాంత బీజేపీ నాయకులు కూడా టీ-బిల్లుకు మద్దతుకు ఆ పార్టీ అధినాయకత్వాన్ని కలిసేందుకు ఢిల్లీ బయలుదేరుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్తో పోటీగా పాల్గొంటూ వచ్చిన బీజేపీ... పార్లమెంట్లో టీ-బిల్లుకు మద్ధతు ఇవ్వకపోతే తెలంగాణలో బీజేపీ కుదేలవుతుందని ఆ పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ అభిప్రాయపడింది. బిల్లుకు పార్లమెంటులో మద్దతివ్వకపోతే తాము ఎన్నికల్లో పోటీ చేయలేమని జిల్లాల నేతలు తెగేసిచెప్తున్నారు. పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకమేనని భావిస్తున్నారు. అందుకే పార్టీ అగ్రనాయకత్వంపై ఒత్తిడి పెంచడానికి భారీ సంఖ్యలో నేతలు ఢిల్లీ వెళ్లాలని
చూస్తున్నారు!!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment