మరో మూడు నెలలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమైనా, రాష్ట్రపతి ఆమోదముద్ర, గెజిట్ జారీ లాంఛనమే అయినా విభజన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చి రెండు రాష్ట్రాలూ అధికారికంగా ఉనికిలోకి రావడానికి కనీసం మరో రెండు మూడు నెలల సమయం పట్టనుంది. రెండు రాష్ట్రాలూ విడిగా పాలన మొదలు పెట్టేందుకు అత్యవసరమైన మౌలిక ఏర్పాట్లు పూర్తి చేయడానికి ఈ మాత్రం గడువు తప్పనిసరని ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో మున్ముందుగా సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారుల విభజనను చేపట్టాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు వీలుగా ఆయా ప్రభుత్వాలు జారీ చేసే చెక్కులు చెల్లేందుకు ఆర్‌బీఐ ఆథరైజేషన్ జారీ చేయాలి. రెండు రాష్ట్రాలకూ ఒక్కో లీడ్ బ్యాంక్‌ను ఖరారు చేయాలి.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment